Manchu family: మంచు ఫ్యామిలీ లోఅసలు ఏం జరిగింది..? 12 d ago
కుటుంబ గొడవల మీద మంచు మనోజ్ మొదటిసారి మీడియా తో స్పందించారు. ఆస్తులు, డబ్బు కోసం పోరాటం చేయడం లేదని, ఆత్మగౌరవం కోసం, తన భార్య, పిల్లల రక్షణ కోసమే పోరాడుతున్నానని మనోజ్ అన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే పారిపోయారని, తనని తొక్కేయడానికి తన భార్య, పిల్లలను లాగుతున్నారని మండిపడ్డారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనకి న్యాయం జరిగేవరకూ అందరినీ కలుస్తానని తెలిపారు. మంగళవారం ఉదయం పెద్ద కొడుకు మంచు విష్ణుకు స్వాగతం పలికేందుకు మోహన్ బాబు ఎయిర్పోర్టకు వెళ్లారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ 'ఏ ఇంట్లో నైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమేనని వారి ఇంట్లో కూడా అలాంటి చిన్న గొడవే జరిగింది తెలిపారు. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలను తాను పరిష్కరించి అందరిని కలిపే ప్రయత్నం చేసానని ఇప్పుడు తన కుటుంబంలో జరిగే సమస్యను తామే పరిష్కరించుకుంటాం అని మోహన్ బాబు తెలిపారు. మరోవైపు విదేశాలనుండి మంచు విష్ణు రావడం తో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య చర్చలు జరుపుతున్నారు.
గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసారు. మనోజ్ ఫిర్యాదు చేసిన గంటలోనే మోహన్ బాబు "తన చిన్న కుమారుడు మనోజ్ తో ప్రాణహానీ ఉందని" లేఖ రూపం లో రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీనితో మనోజ్ తో పాటు అతని భార్య మౌనికపై కూడా కేసు నమోదు అయ్యింది.
తండ్రి మోహన్ బాబు చేసిన ఫిర్యాదు పై మనోజ్ స్పందిస్తూ "తన పరువు తీయడానికి, తన గొంతు నొక్కడానికే తన తండ్రి మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుడు ఆరోపణులు చేస్తున్నాడు తాను ఆర్ధిక సహాయం కోసం తన కుటుంబం పై ఆధార పడలేదని ఎటువంటి ఆస్తులను కోరలేదని తెలిపారు. విష్ణు దుబాయ్ కి వెళ్లిన తర్వాత తన తల్లి ఒంటరిగా ఉన్నందున తన తండ్రి ఇంటికి పిలిచారని మనోజ్ తెలిపారు. కానీ తాను తప్పుడు ఆలోచనతో నాలుగు నెలల క్రితం ఆ ఇంట్లో కి వచ్చినట్లు ఫిర్యాదు లో తనపై తప్పుడు ఆరోపణులు చేశారని పేర్కొన్నారు. తన సోదరుడు విష్ణు ఇప్పటికి తన తండ్రి నుంచి మద్దతు పొందుతూనే ఉన్నాడని, ఆయన కూడా ఎప్పుడూ విష్ణుకే మద్దతుగా ఉంటూ వచ్చారన్నారు. విష్ణు స్వలాభం కోసం కుటుంబ పేరును వాడుకుంటూ వచ్చాడని తానెప్పుడూ స్వతంత్రంగానే జీవిస్తూ వస్తున్నానని మనోజ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.